అన్నాకేటీఆర్ చూసావా... చీప్ లీడర్ అన్నోడే చీఫ్ మినిస్టర్ అయ్యాడు..: బండ్ల గణేష్ రియాక్ట్ 

By Arun Kumar P  |  First Published Dec 6, 2023, 9:11 AM IST

రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ నాయకులు చీఫ్ లీడర్ అంటూ హేళన చేసారు... కానీ ఇప్పుడు ఆచనే చీఫ్ మినిస్టర్ అయ్యారంటూ ఓ నెటిజన్ కామెంట్ కు నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. 


హైదరాబాద్ : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఎనుమల రేవంత్ రెడ్డికి సినీ నిర్మాత బండ్ల గణేష్ తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి గతంలో బూర్గుల రామకృష్ణారావు(1952)హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసారని... ఇప్పుడు అదే జిల్లానుండి ఎనుముల రేవంత్ రెడ్డి (2023) ముఖ్యమంత్రి అవుతున్నారని బండ్ల గణేష్ గుర్తుచేసారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ సుపరిపాలన అందిస్తూనే అభివృద్దికి పాటుపడతారని బండ్ల పేర్కొన్నారు. 

నిరంతరం తన శ్రేయస్సును కోరుకునే రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి దక్కడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బండ్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.  

Latest Videos

ఇలా ఎక్స్ వేదికన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడమే కాదు కొన్ని ఆకస్తికరమైన ట్వీట్లకు రీట్వీట్ చేసారు బండ్ల గణేష్.  ఓనెటిజన్ 'అన్నా కేటీఆర్...  మా రేవంత్ రెడ్డిని  చీప్ లీడర్ అని హేళన చేసి చేసి చాలా స్ట్రాంగ్ చేశారు.!! ఇపుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు..!! థ్యాంక్యూ' అంటూ  చేసిన ట్వీట్ కు బండ్ల గణేష్ స్పందించారు. 

Also Read  Revanth Reddy : ఏబివిపి కార్యకర్త నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు ... రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

ఇక ఎన్నికల పలితాల కంటే ముందే కాంగ్రెస్  గెలుస్తుందని... రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న ప్రమాణస్వీకారం వుంటుందని... తాను మాత్రం 7నే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానని బండ్ల అన్నారు. ఈ మాటలను కూడా ఓ నెటిజన్ గుర్తుచేసాడు. నీకోసమే డిసెంబర్ 9న కాకుండా 7న నూతన సీఎం రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం పెట్టారన్న నెటిజన్ కామెంట్ పై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. 

ఇక తెలంగాణ కేబినెట్ మంత్రులు వీరేనంటూ కొందరు కాంగ్రెస్ నేతల పేర్లు ప్రచారం అవుతున్నాయి. ఎవరికి ఏ శాఖ ఇవ్వనున్నారో కూడా కొన్ని వార్తలు ప్రచురిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయవద్దని బండ్ల గణేష్ కోరారు. 
 

click me!