Telangana CM : రేవంత్ రెడ్డికి.. హీరో మహేష్ బాబుకు ఇష్టమైన వ్యక్తి ఒక్కరే..

By SumaBala BukkaFirst Published Dec 6, 2023, 7:48 AM IST
Highlights

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ఇష్టాఇష్టాలు, అభిరుచుల మీద ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి. ఆయనకు మహేష్ బాబుకు ఓ పోలిక ఉంది. 

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి.. తెలంగాణకు రెండో సీఎం... మొట్ట మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే యంగ్ అండ్ డైనమిక్ లీడర్. నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ ఏర్పడిననాటినుంచి అధికారంలో ఉన్న ఉద్యమపార్టీ బీఆర్ఎస్ ను వద్దనుకున్నారు. కాంగ్రెస్ కు ఒక్కఛాన్స్ ఇద్దామనుకున్నారు. 

కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా అధిష్టానం మాత్రం రేవంత్ కే అండగా నిలిచింది. తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ ను మళ్లీ ట్రాక్ లోకి తేవాలంటే రేవంత్ లాంటి యువకుడు, దుందుడుకుగా పోయే వ్యక్తి కావాలనుకున్నారు. కేసీఆర్ లాంటివాడిని ధీటుగా ఎదుర్కోవడానికి రేవంతే సరైన వ్యక్తి అని అంచనా వేశారు. వారి అంచనాలను వమ్ము చేయలేదు రేవంత్ రెడ్డి. 

Telangana Cabinet: తెలంగాణకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు! సీతక్కకు ఏ శాఖ?

తెలంగాణలో పదేళ్ల తరువాత అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. దీంతో రాష్ట్రాన్ని నడిపే బాధ్యత కూడా ఆయన మీదే పెట్టారు. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు.. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, రాజకీయంగా చిత్తు చేసే వ్యూహాలతో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డికి ఓ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టమట. 

రేవంత్ రెడ్డి సినిమాలు కూడా చూస్తారా? అని ఆశ్చర్యం వేస్తుందా? రాజకీయాల్లో బిజీ అయిన తరువాత రేవంత్ కు సినిమాలు చూసే తీరిక, ఆసక్తి లేదట.. కానీ అంతకు ముందు ఆయనకు ఓ టాలీవుడ్ సూపర్ స్టార్ అంటే విపరీతమైన ఇష్టం అట. అతనే దివంగత సూపర్ స్టార్ కృష్ణ. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు. ఇక మహేష్ బాబు కూడా చాలాసార్లు తన తండ్రే తన ఇష్టమైన హీరో అని చెప్పిన సంగతి తెలిసిందే. 

click me!