దర్బాంగా పేలుడు: ఫేక్ పాన్ కార్డు, మొబైల్‌ సమాచారంతో పార్శిల్ బుకింగ్

By narsimha lodeFirst Published Jul 2, 2021, 12:49 PM IST
Highlights

బీహార్ లోని దర్భాంగా పేలుడు ఘటనకు స్కెచ్ వేసిన  లష్కరే తోయిబా ఉగ్రవాదులు  పకడ్బందీ ప్లాన్  వేశారు. పేలుడు తర్వాత పోలీసు దర్యాప్తులో  తమ ఉనికి  కన్పించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. కానీ, నిందితులు మాత్రం పోలీసులకు చిక్కారు.

హైదరాబాద్: బీహార్ లోని దర్భాంగా పేలుడు ఘటనకు స్కెచ్ వేసిన  లష్కరే తోయిబా ఉగ్రవాదులు  పకడ్బందీ ప్లాన్  వేశారు. పేలుడు తర్వాత పోలీసు దర్యాప్తులో  తమ ఉనికి  కన్పించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. కానీ, నిందితులు మాత్రం పోలీసులకు చిక్కారు.

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుండి వచ్చిన పార్శిల్ కారణంగానే పేలుడు చోటు చేసుకొందని బీహారో రైల్వేస్టేషన్  ఘటన విచారణ అధికారులు గుర్తించారు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో  ఇమ్రాన్ , నాసిర్  సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు ఆధారాలను పార్శిల్ బుక్ చేసే సమయంలో నిందితులు ఇచ్చారు.

also read:దర్భాంగా పేలుళ్ల కేసు: హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు.. ఇమ్రాన్ ఇంటిలో పేలుడు పదార్ధాలు లభ్యం

తప్పుడు మొబైల్ నెంబర్ తో పాటు సుఫియాన్ పేరుతో  తయారు చేయించిన పాన్ కార్డును కూడ ఈ సందర్భంగా నిందితులు అందించారు.  పేలుడు తర్వాత విచారణ జరిగితే తమ ఉనికిని గుర్తించకుండా ఉండేందుకు గాను  ఈ జాగ్రత్తలు తీసుకొన్నారని ఎన్ఐఏ గుర్తించింది.రైలు  బోగీలను పేల్చాలని నిందితులు ప్లాన్ చేశారు. అయితే  నిందితులు అమర్చిన పేలుడు పదార్ధం సరిగా పట్టాల మధ్య నుండి లీకవడంతో భారీగా విస్పోటనం చోటు చేసుకోలేదని భావిస్తున్నారు.ఈ విషయమై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

click me!