టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్: ఏబీవీపీ నిరసన.. ఓయూలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Mar 25, 2023, 2:54 PM IST
Highlights

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ  నిరనసకు దిగింది.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి తరలించారు. 

టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి, చైర్మన్‌ను అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డ తెలంగాణ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులను తొలగించుకండా తమాషా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్ ఘటనలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపించారు. సిట్ మీద తమకు లేదన్న ఏబీవీపీ కార్యకర్తలు.. పేపర్ లీక్ ఘటనలో అసలు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

click me!