
హైదరాబాద్: తెలంగాణ సీఎం kcr క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ ముందు Youth Congress నేతలు సోమవారం నాడు ధర్నాకు దిగారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యోగాలు దక్కుతాయని భావించిన వారికి నిరాశే మిగిలిందని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Pragathi bhavan గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. గేట్లు ఎక్కిన యూత్ కాంగ్రెస్ కార్యక్తలను పోలీసులు కిందకు దింపారు. ఈ సమయంలో పోలీసులు, యూత్ కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది.ఈ సమయంలో ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Nsui ,యూత్ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం తీసుకొంటున్న విధానాలపై నిరసన కార్యక్రమాలకు దిగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.