ప్రగతి భవన్ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం, ఉద్రిక్తత: అదుపులోకి తీసుకున్న పోలీసులు

Published : May 05, 2022, 02:48 PM IST
ప్రగతి భవన్ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం, ఉద్రిక్తత: అదుపులోకి తీసుకున్న పోలీసులు

సారాంశం

రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ మీటింగ్ కి అనుమతివ్వాలని ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు గురువారంనాడు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: Congressపార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi  ఓయూ సమావేశానికి  అనుమతివ్వాలని కోరుతూ గురువారం నాడు హైద్రాబాద్ లో ప్రగతి భవన్ ను NSUI కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే Pragathi Bhavan  గేటు వద్దే ఎన్‌ఎస్ యూఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ నెల 6, 7 తేదీల్లో Telanganaలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీన Warangal లో జరిగే రాహుల్ గాంధీ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ నెల 7న ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఓయూ వీసీని కోరింది. అయితే ఓయూ వీసీ మాత్రం రాహుల్ గాంధీ టూర్ కి అనుమతివ్వలేదు.ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఓయూ విద్యార్ధులతో రాహుల్ గాంధీ ముఖా ముఖి కి ప్లాన్ చేశారు. అయితే ఈ  టూర్ కి ఓయూ వీసీ అనుమతిని నిరాకరించారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు దాఖలు చేసింది. ఇవాళ ప్రగతి భవన్ వద్ద ఎన్‌‌ఎస్‌యూఐ కార్యకర్తలు, నేతలు ప్రయత్నించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్