తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక:ఈ నెల 30న పోలింగ్

By narsimha lode  |  First Published May 5, 2022, 2:19 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఎన్నకల సంఘం గురువారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది. 


హైదరాబాద్: Telanganaలో Rajya Sabha ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది. టీఆర్ఎస్ కి చెందిన రాజ్యసభ సభ్యుడు Banda Prakash  రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించనున్నారు.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ 2021 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. బండ ప్రకాష్ కి ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ కేటాయించారు. దీంతో ఈ పదవి ఖాళీగా ఉంది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

Latest Videos

undefined

రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్  విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 19వ  తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.ఈ నెల 20న నామినేషన్ల స్కృూట్నీ నిర్వహించనున్నారు. ఈ నెల 23న  నామినేషన్ల ఉపసంహరణకు  చివరి తేదీ. ఈ నెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు  పోలింగ్ నిర్వహించారు.  జూన్ 1వ తేదీన  ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకత్వం ఎవరితో భర్తీ చేస్తుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.  టీఆర్ఎస్ లో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. అయితే ఈ  పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.రాజ్యసభ ఎంపీతో పాటు నామినేటేడ్ పదవుల కోసం టీఆర్ఎస్ నేతలు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే వచ్చే ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో పార్టీకి పనికొచ్చే వారికి రాజ్యసభ స్థానం కట్టబెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2018లో బండ ప్రకాష్ కు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ ను రాజ్యసభకు పంపారు. అయితే  అనుహ్యాంగా గత ఏడాది బండ ప్రకాష్ ను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేశారు.ఈ ఒక్క స్థానానికి టీఆర్ఎస్ చీఫ్ ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ గులాబీ వర్గాల్లో నెలకొంది.  పదవుల ఎంపిక విషయంలో టీఆర్ఎస్ చీప్ అనుహ్య నిర్ణయాలు తీసకొంటారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి పేరును ఖరారు చేసి ఆమెను గెలిపించారు. అంతకు ముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రచారం జరిగింది. కానీ గ్రాడ్యుయేట్స్ కోటాలో వాణీదేవిని బరిలో నిలిపి టీఆర్ఎస్ గెలిపించింది. 

ఈ ఎంపీ పదవి కోసం పలువురు ఆశావాహులు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లకు ఈ ఎంపీని కట్టబెడుతారా లేదా అనుహ్యంగా తెరపైకి కొత్త పేరును తీసుకు వస్తారా అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో లేకపోలేదు.

click me!