ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య మృతి: పరిగి డిపో వద్ద ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Nov 22, 2019, 1:03 PM IST
Highlights

ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య మృతి చెందాడు. వీరభద్రయ్య మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు పరిగి ఆర్టీసీ డిపో వద్ద ధర్నాకు దిగారు. మృతదేహంతో పరిగి డిపోలోకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొన్నారు. 

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్సు డిపో వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు ఆ:దోళనకు దిగారు. 

పరిగి ఆర్టీసీ డిపోలో  డ్రైవర్ గా వీరభద్రయ్య పనిచేస్తున్నాడు. అయితే వీరభద్రయ్య మృతి చెందాడు.  వీరభద్రయ్య మృతదేహంతో పరిగి ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు.

వీరభద్రయ్య మృతదేహంతో  ఆర్టీసీ కార్మికులు  పరిగి ఆర్టీసీ డిపోలోకి చొచ్చుకొని  వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో  పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకొన్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా వీరభద్రయ్య గుండెపోటుతో మృతి చెందినట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు చెప్పారు.

ఉద్యోగం విషయంలో ఆయన మనోవేదనకు గురైనట్టుగా జేఎసీ నేతలు చెబుతున్నారు. వీరభద్రయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని జేఎసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టారు. పరిగి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్లను సాధించాలని కోరుతూ కార్మికులు సమ్మెలోకి దిగారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో   భేషరతుగా విధుల్లో చేరడానికి ఆర్టీసీ కార్మికులు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అయితే  ఆర్టీసీ కార్మికుల ప్రకటన విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. హైకోర్టు పూర్తి తీర్పు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మె యధాతథంగా కొనసాగిస్తామని  జేఎసీ నేతలు ప్రకటించారు.ఈ తరుణంలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరో వైపు తమ ఉద్యోగాల విషయమై సమ్మెలో ఉన్న కార్మికులు కూడ మనోవేదన చెందుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. సమ్మె విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందోననేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

 

click me!