ముట్టడికి ఏబీవీపీ యత్నం, అరెస్ట్: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత

Published : Jun 19, 2022, 04:03 PM IST
 ముట్టడికి ఏబీవీపీ యత్నం, అరెస్ట్: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత

సారాంశం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు మద్దతుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో  కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ కార్యకర్తలు,నేతలనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ట్రిపుల్ ఐటీ లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అరెస్ట్ చేసిన ఏబీవీపీ క్యాడర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

నిర్మల్: Basara IIIT ట్రిపుల్ ఐటీ వద్ద ఆదివారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది.  బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు ప్రయత్నించారు.ABVP కార్యకర్తలను పోలీసులు Arrest చేశారు. ఒకానొక సమయంలో ట్రిపుల్ ఐటీ గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. తమ డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు గత ఆరు రోజులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నెల 18న విద్యార్ధులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి Indrakaran Reddy ప్రకటించారు. కానీ చర్చలు సఫలం కాలేదని విద్యార్ధులు తేల్చి చెప్పారు. ఇవాళ ఉదయం నుండి విద్యార్ధులు ఆందోళన సాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ ఏఓ ను ప్రభుత్వం విధుల నుండి తప్పించింది. 

బాసర ట్రిపుల్ ఐటీ   విద్యార్ధులు  ఆరు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల 16న  బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రోఫెసర్ సతీష్ కుమార్ ను నియమించింది ప్రభుత్వం. తాము లేవనెత్తిన 12 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇదిలా ఉంటే తమ డిమాండ్లపై ప్రభుత్వం చులకనగా మాట్లాడడాన్ని విద్యార్ధులు తప్పు పట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ డిమాండ్లను సిల్లీ డిమాండ్లు పేర్కొన్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చి చూస్తే తమ డిమాండ్లు న్యాయబద్దమైనవో కావో తెలుస్తుందన్నారు.  చర్చలకు పిలిచి జిల్లా అధికారులు తమతో వ్యవహరించిన తీరు సరిగా లేదని విద్యార్ధులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనుకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

విద్యార్ధులు ఆందోళనను విరమించాలని ప్రభుత్వం కోరుతుంది. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని కూడా విద్యార్ధులు తేల్చి చెప్పారు.  మరో వైపు విద్యార్ధుల ఆందోళన విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరారు. అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లనున్నట్టుగా గవర్నర్ చెప్పారు.

వర్షంలో కూడా విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయమై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యసాధన కోసం ట్రిపుల్ ఐటీలో చేరారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆమె విద్యార్ధులకు సూచించారు.  మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆమె విద్యార్ధులను కోరారు.  ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో జిల్లా  అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రూ. 12 లక్షలను తక్షణమే విడుదల చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు.

also read:బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన:ఆరు రోజులుగా ఆగని స్టూడెంట్స్ నిరసనలు

కానీ తాము చేస్తున్న 12 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి తమకు కచ్చితమైన హామీని ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు.బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి.  ట్రిపుల్ ఐటీ వద్దకు మీడియా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వైపు విద్యార్ధులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu