హైద్రాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీరు, వాహనదారుల ఇక్కట్లు

By narsimha lode  |  First Published Jun 19, 2022, 2:50 PM IST

హైద్రాబాద్ నగరంలో ఆదివారం నాడు పలు చోట్ల వర్షంకు రిసింది. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీరు నిలిచింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో  హైద్రాబాద్ లో వర్షం కురుస్తుంది. 


హైదరాబాద్:  Hyderabad నగరంలోని పలు చోట్ల ఆదివాంరం నాడు మధ్యాహ్నం  Heavy Rains వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. వర్షంతో Traffic కు అంతరాయం ఏర్పడింది. South West Monsoon కారణంగా హైద్రాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి.  హైద్రాబాద్ నగరంలోని దిల్‌సుఖ్ నగర్ సరూర్ నగర్, కర్మన్ ఘాట్, బోయిన్‌సల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేటలలో వర్షం కురిసింది.

నైరుతి రుతుపవనాలు Telangana రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే వర్షాలను తీసుకువచ్చాయి. ఈ నెల 15న  రాత్రి  హైద్రాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.  ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ నెల 14న కూడా హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్ం చేశారు. అయితే వర్షపాతం నమోదు కాలేదు. కానీ ఈ నెల 17న  ఉదయం నుండి వర్షం ప్రారంభమైంది. గంటకి పైగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

Latest Videos

undefined

నగరంలోని పాతబస్తీలో గల ఛత్రినాక, శివగంగా నగర్, శివాజీ నగర్ లలో వరద నీరు రోడ్లపై పొంగిపొర్లింది. దీంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. మణికొండలో కూడా వర్షం నీరు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మరో రెండు రోజుల పాటు హైద్రాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెం.మీ. వర్షం నమోదైంది. అత్యల్పంగా సింగపూర్ టౌన్ షిప్ దగ్గర 5.6 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రానికి పశ్చిమదిశ నుంచి కింది గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఈ ఏడాది మే 31న హైద్రాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో  ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో  ల్యాండింగ్ కావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు.  వాతావరణంలో మార్పుల వల్లే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి - హైదరాబాద్, ఢిల్లీ- హైదరాబాద్ విమానాలు బెంగళూరుకు మళ్లించారు. అలాగే పాట్నా- హైదరాబాద్ విమానం విజయవాకు మళ్లించారు. 

నగరంలోని  మీర్‌పేట‌, బ‌డంగ్‌పేట్‌, బాలాపూర్, గుర్రంగూడ‌, ఎల్బీన‌గ‌ర్‌, సంగారెడ్డి, బీహెచ్ఈఎల్ , ఉస్మానియా యూనివ‌ర్సిటీ, రాంన‌గ‌ర్‌, ఉప్ప‌ల్, నాచారం ప‌రిధిలోనూ వ‌ర్షం కురిసింది. దీంతో ఉద‌యం నుంచి ఉక్క‌పోత‌కు గురైన ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. మరోవైపు అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని కాటమయ్య ఆలయంపై పిడుగు పడింది. దీని ధాటికి ఆలయ గోపురం పై భాగం ధ్వంసమైంది. పిడుగుపడిన సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

also read:Assam: అసోంను ముంచెత్తిన భారీ వ‌ర్షాలు.. గోడ‌కూలి ఇద్ద‌రు మృతి.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు !

ఈ ఏడాది మే 4న హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరింది. . కొన్నిచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చార్మినార్, మలక్‌పేట్, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్‌లలో హోర్డింగ్స్ కూలిపోయాయి. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బాబా నగర్, పిస్సల్ బండ, యాకత్‌పురాలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉప్పల్, రామంతాపూర్‌లలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
 

click me!