చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలుఅడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చిన్నకొండూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ ,కాంగ్రెస్ అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం నాడు చిన్నకొండూరు గ్రామానికి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి చిన్నకొండూరు గ్రామానికి రాగానే టీఆర్ఎస్ ,కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రచారం చేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయబోయారు. బీజేపీ కార్యకర్తలు కూడ ప్రతిగా నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెంచిన బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి., గ్యాస్ సిలిండర్ల ఫ్లెక్సీలను చేతబూని ఆందోళనలు చేశాయి.
undefined
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన రాజీనామా చేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అదే నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2018 ఎన్నికల్లో మునుగోడు స్థానం నుండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 12 దఫాలు ఎన్నికలు జరిగాయి. ఆరు దఫాలు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఐదు దఫాలు సీపీఐ, ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధుల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలుమార్లు ఈ స్థానంనుండి గెలుపొందారు.
also read:మునుగోడు ఉపఎన్నిక ... ఆర్వోపై వేటు అందుకే : తెలంగాణ సీఈవో వికాస్ రాజ్
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేయడం లేదు. తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు మునుగోడులో తన అనుచరులకు ఫోన్లు చేసి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పినట్టుగా ఉన్న ఆడియో సంభాషణ ఒకటి వెలుగు చూసింది. ఈ ఆడియో సంభాషణను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది.