బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ ముందు కాంట్రాక్టర్ల ధర్నా: ఉద్రిక్తత, అరెస్ట్

By narsimha lode  |  First Published Aug 29, 2023, 12:23 PM IST


జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు  కాంట్రాక్టర్లు  ఇవాళ  ఆందోళనకు దిగారు. తమ పెండింగ్ బిల్లును చెల్లించాలని  కాంట్రాక్టర్లు  డిమాండ్ చేస్తున్నారు.
 


హైదరాబాద్:  జీహెచ్ఎంసీ  కార్యాలయం ముందు మంగళవారంనాడు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు.పెండింగ్ బిల్లులు చెల్లించాలని  జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు  కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు.  రూ. వెయ్యి కోట్లు బకాయిలను తమకు చెల్లించాలని  కాంట్రాక్టర్లు  కోరారు. తమకు జీహెచ్ఎంసీ నుండి రావాల్సిన బకాయిలను  చెల్లించాలని కుటుంబ సభ్యులతో  జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు.ఆందోళనకు దిగిన కాంట్రాక్టర్లను  పోలీసులు అడ్డుకున్నారు.ఈ విషయమై  పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు  చేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.  జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కాంట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2022  సెప్టెంబర్  20వ తేదీన జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు.  ఈ ఆందోళన తర్వాత కాంట్రాక్టర్లకు  జీహెచ్ఎంసీ  కాంట్రాక్టర్లకు  బిల్లులను చెల్లించింది. తాజాగా  జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు  ఆందోళనకు దిగారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్  చేశారు.
 

Latest Videos

click me!