
నిజామాబాద్ జిల్లాలో ధర్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్పల్లికి వచ్చేందుకు సిద్దమయ్యారు. అయితే ఎంపీ అరవింద్ రాకను నిరసిస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టడంపై బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎస్సైకి గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.