ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు..

Published : Nov 14, 2022, 09:44 AM IST
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు..

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధరణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధరణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో నవంబర్‌ నెలలోనే చలి గజ గజ వణికిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఎక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్,  మెదక్ జిల్లాలో చలితీవ్రత బాగా పెరిగింది. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం కొమురంభీమ్ జిల్లాలో 11.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 12.2 డిగ్రీలు, మంచిర్యాలలో 13.3 డిగ్రీలు, నిర్మల్‌లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే.. 13.4, సంగారెడ్డిలో 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. 

ఇక, సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఆదివారం ఉదయం కుమురం భీం జిల్లాలో 11.2 డిగ్రీలు, మెదక్‌ జిల్లాలో 12.8 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్దుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.