హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా స్టాల్ ప్రారంభం..

By SumaBala BukkaFirst Published Dec 20, 2021, 9:50 AM IST
Highlights

వికీపీడియాలోని సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, తెలంగాణ ప్రభుత్వం  భాగస్వామ్యంతో  హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ  'ప్రాజెక్ట్ ఇండిక్ వికీ' ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో  భాగంగా తెలంగాణ సమాచారాన్ని తెలుగు వికీపీడియా ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలని 
State IT Department నిర్ణయించింది.

వికీపీడియాలో తెలంగాణ సమాచారం తెలుగులో పొందుపర్చడంపై రాష్ట్ర ఐటీ శాఖ దృష్టి పెట్టింది. దీనిద్వారా రాష్ట్ర సాంస్కృతిక, భౌగోళిక, చారిత్రక, పర్యాటక, సమాచారం  తెలుగులో అందుబాటులోకి రాబోతుంది. వివిధ రంగాల నిపుణులకు, ఔత్సాహికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రాజెక్టు తెలుగు వికీకి ప్రాచుర్యం కల్పించేందుకు  తెలంగాణ ఐటీ శాఖ డిజిటల్ మీడియా విభాగం  బుక్ ఫెయిర్ లో స్టాల్ ఏర్పాటు చేసింది.  NTR Gardensలోని తెలంగాణ కళాభారతి మైదానంలోజరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో  తెలుగు వికీ స్టాల్ ను  ఐటీ శాఖ కార్యదర్శి Jayesh Ranjanలాంఛనంగా ప్రారంభించారు.

ఆన్ లైన్  విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనే 'Wikipedia'లో తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగులో అందుబాటు లోకి తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ  విస్తృత కార్యక్రమాలు చేపడుతోంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన మొదట్లో సమాచారమంతా ఇంగ్లిషులోనే అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో రాష్ట్రంలోని వివిధ రంగాలు, అంశాలకు సంబంధించిన సమాచారాన్ని  స్థానిక భాషలోకి మార్చే (లోకలైజేషన్) బాధ్యతను తెలంగాణ ఐటీ శాఖ చేపట్టింది. 

‘మేమిద్దరం కలిసి బ్రతుకుతాం’.. తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్...

వికీపీడియాలోని సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, తెలంగాణ ప్రభుత్వం  భాగస్వామ్యంతో  హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ  'ప్రాజెక్ట్ ఇండిక్ వికీ' ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో  భాగంగా తెలంగాణ సమాచారాన్ని తెలుగు వికీపీడియా ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలని 
State IT Department నిర్ణయించింది. Telugu Wikipediaపై అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ Book Fair ప్రత్యేక స్టాల్ ను తెలంగాణ ఐటీ శాఖ ప్రారంభించింది.

స్టాల్ ప్రారంభించిన తరువాత మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి ప్రతిఒక్కరు కృషిచేయాలని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ప్రస్తుత కాలంలో స్థానిక భాషల్లో సమాచారాన్ని కోరుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, దానికనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాలం లో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తోందని తెలంగాణ ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గారు అన్నారు. సమాచార వ్యాప్తికి తెలుగు వికీపీడియన్లు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం, ప్రాజెక్ట్ ఇండిక్ వికి co-pi, ఐఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక మామిడి, వికీపీడియా సముదాయ సభ్యులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

click me!