
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం అన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశనం చేశారని.. రాష్ట్ర ప్రజలకు ఆయన ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు.
ALso REad: క్రిస్మస్ కి ఈ బహుమతులు.. అదృష్టాన్ని ఇస్తాయి..!
అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని.. శాంతి, కరుణ, సహనం , ప్రేమను ఆయన చాటారని కేసీఆర్ గుర్తుచేశారు. మానవీయ విలువలు మృగ్యమైపోతున్న ప్రస్తుత కాలంలో ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని సీఎం వ్యాఖ్యానించారు. తోటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాలను ఆచరించాలని.. ప్రజలందరికీ ఏసుక్రీస్తు దీవెనలు లభించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.