30 రూపాయల కోసం హోటల్ ఓనర్‌కి గన్‌ గురిపెట్టి.. వీడియో వైరల్, రంగంలోకి పోలీసులు

Siva Kodati |  
Published : Dec 24, 2022, 08:40 PM ISTUpdated : Dec 24, 2022, 08:41 PM IST
30 రూపాయల కోసం హోటల్ ఓనర్‌కి గన్‌ గురిపెట్టి.. వీడియో వైరల్, రంగంలోకి పోలీసులు

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలోని గోల్కొండ హోటల్‌లో తుపాకీతో హల్ చల్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 కోసం హోటల్‌ యజమానికి వీరు తుపాకీ గురిపెట్టారు.   

రూ. 30 కోసం హోటల్‌లో జరిగిన గొడవ ఇద్దరిని జైలు పాలు చేసింది. హైదరాబాద్ పాతబస్తీలోని గోల్కొండ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు తుపాకీ చూపించి యజమానిని బెదిరించారు. కత్తితో పొడిచేస్తామంటూ హెచ్చరించారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనిని యజమాని తన మిత్రులకు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో .. వారిని ప్రత్యేక బృందాలతో గాలించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ఉస్మాన్,సయ్యద్ మొహినుద్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. హోటల్‌లో తాము రూ.2000 నోటు ఇచ్చామని.. యజమాని చిల్లర లేదు అనడంతో ఎయిర్ గన్‌తో బెదిరించామని నిందితులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!