డబ్బులన్నీ ఆపేసింది... కేంద్రం వల్లే ఇలా, టీచర్ల వేతనాల ఆలస్యంపై హరీష్ రావు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 24, 2022, 7:02 PM IST
Highlights

కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే తెలంగాణను ఇబ్బందిపెడుతోందన్నారు ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిలిపివేయడం వల్లే రాష్ట్రంలో టీచర్ల వేతనాల చెల్లింపు ఆలస్యమైందన్నారు. 

తెలంగాణలో టీచర్ల వేతనాల చెల్లింపు ఆలస్యం కావడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిలిపివేయడం వల్లే  ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణను కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిన రూ.5 వేల కోట్లను కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. దేశంలోనే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకుంటున్నది తెలంగాణ ఉపాధ్యాయులేని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీతో వున్నారని.. ఉద్యోగుల సమస్యలన్నింటీని పరిష్కరిస్తారని హరీశ్ తెలిపారు. విద్యా శాఖలో ఖాళీగా వున్న పోస్టులన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. 

ఇదిలావుండగా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్న ఆయన.. మరో రాష్ట్రంలో తెలంగాణ తరహా అభివృద్ధి పథకాలను చూపిస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.  బండి సంజయ్‌ తనని ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తానని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులకు న్యాయం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రైతును రాజును చేశారని మల్లారెడ్డి ప్రశంసించారు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలిపెట్టి.. రైతుల కోసం ఖర్చు చేసిన పైసల్ని ఇవ్వమంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also REad: క‌రోనా బూస్ట‌ర్ డోసులు స‌ర‌ఫ‌రా చేయండి.. కేంద్రానికి మంత్రి హరీష్ విజ్ఞప్తి..

ఇకపోతే... ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణాన్ని కావాలనే రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే కల్లాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. రైతులకు ఉపయోగం కోసం కల్లాలు నిర్మిస్తే ఆ నిధులు వెనక్కి ఇవ్వమని అడగడమేమిటని అన్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. 

click me!