రూ.20 వాటర్ బాటిల్ పై కోర్టులో తెలుగోడి పోరాటం

Published : Feb 18, 2017, 12:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
రూ.20 వాటర్ బాటిల్ పై కోర్టులో తెలుగోడి పోరాటం

సారాంశం

సర్వీ హొటల్ యాజమాన్యానికి 20 వేల జరిమానా విధించిన కోర్టు

వినియోగదారుల అవగాహనలేమిని నగరంలోని కొన్ని హోటళ్లు భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి. తినడానికి వచ్చిన వారి చేతి చమురును వదిలిస్తున్నాయి. మనం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా బిల్లు రాగానే పర్సు తీసి ఫుల్ అమౌంట్ కట్టేస్తున్నాం.ఇదే వీక్ పాయింట్ వారి పాలిట వరంగా మారింది. ఎంఆర్పీ ధరలకు డబుల్ రేట్లు పెట్టి కస్టమర్ల జేబులను కొల్లగొడుతున్నాయి నగరంలోని కొన్ని హోటళ్లు.

 

కానీ, అందరూ మనలా ఉండరు కదా... ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్ కొండయ్య అనే వ్యక్తి  ఈ దోపిడీకి చరమగీతం పాడేందుకు సిద్దమయ్యారు.

 

ఇటీవల ఆయన హైదారాబాద్ లోని బంజారాహిల్స్ లో  ఉన్న సర్వీ హోటల్ కు వెళ్లారు. అక్కడ రూ. 20 ల వాటర్ బాటిల్ కు  రూ. 40 ధర పెట్టి కొండయ్య బిల్లులో వేశారట.

 

దీనిపై ఆయన హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు లైట్ తీసుకున్నారట. దీంతో కొండయ్య ఈ దోపిడీపై జిల్లా వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

దీనిపై స్పందించిన కోర్టు సర్వీ యాజమాన్యానికి నోటీసులు పంపింది. వారు మాత్రం కొండయ్య తమ హొటల్ కే రాలేదని చెప్పారు. కానీ, కొండయ్య సాక్షాలతో సహా వచ్చారు. వాటిని పరిశీలించిన కోర్టు సర్వీ యాజమాన్యానికి రూ. 20 వేలు జరిమానా విధించింది.

 

ఎంఆర్పీ ధర రూ. 20 గా ఉన్న  వాటర్ బాటిల్ ను రూ. రూ. 40 కి అమ్మడం నిబంధలను ఉల్లంఘించడమే అని నిర్ధారించింది. కొండయ్యకు రూ. 20 వేల నష్టపరిహారంతో పాటు, రూ. 20 అదనంగా వాటర్ బాటిల్ మీద తీసుకున్నందుకు మరో రూ. 5 వేలు చెల్లించాలని సర్వీ హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

 

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి