తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. రమేష్ సహా పలువురిని ఈడి అధికారులు ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగిందని సీసీఎస్ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో Enfocement directorate (ED) రంగంలోకి దిగింది. సీసీఎస్ నుంచి Telugu Akademi కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ వివరాలను ఈడి అధికారులు తీసుకున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి (ఎసీవో) రమేష్ తో పాటు పలుపురిని ప్రశ్నించారు.
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రమణారెడ్డి, భూపతి, వినయ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో Telugu Akademi scam కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరుకుంది. నకిలీ ఎఫ్ డీల తయారీలో తాజాగా అరెస్టైన ముగ్గురు కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సాయి కుమార్ కు వారు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
undefined
Also Read: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో సాయికుమార్ కీలక పాత్ర: హైద్రాబాద్ సీపీ
ఈ కేసులో 9 మందిని తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణ అకాడమీకి చెందిన 64.5 కోట్ల రూపాయలను ముఠా కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర సంచలనం సంచలనం సృష్టించింది. ఈ కేసులో యుబిఐ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీతో పాటు తెలుగు అకాడమీ ఏసీవో రమేష్ అరెస్టయ్యారు.
అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే Enforcement Directorate (ED)కి అందించారు. కొల్లగొట్టిన తెలుగు అకాడమీ నిధులను నిందితులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్లు గుర్తించారు. కొంత మంది తమ అప్పులను తీర్చుకున్నట్లు కూడా చెబుతున్నారు. తెలుగు అకాడమీ నిధులను కొల్లగొట్టడానికి నిందితులు పక్కా ప్లాన్ వేసి అమలు చేశారు. నిజానికి, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం రూ.320 కోట్లు కొట్టేయాలని స్కెచ్ వేసినట్లు భావిస్తున్నారు.
Also Read: తెలుగు అకాడమీ స్కామ్ నిందితులు వీరే :రూ.324 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్
పద్మనాభన్ అనే నిందితుడిని పోలీసులు కోయంబత్తూరులో అరెస్టు చేశారు. దీంతో అరెస్టయినవారి సంఖ్య11కు చేరుకుంది. తాజా మూడు అరెస్టులతో ఆయన సంఖ్య 14కుచేరుకుంది. తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు 9 మందిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.