
ఢిల్లీ : Telugu Academy ఆస్తుల విభజనకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ ను telangana ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అకాడమీ ఆస్తుల విభజనకు సంబంధించి హైకోర్టు 2021, జనవరి 21న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం supreme courtను ఆశ్రయించింది. పిటిషన్పై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణ ఆరంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరారు.
కేసును పలుమార్లు విచారించిన తర్వాత పిటిషన్ ఉపసంహరించుకుంటామనడంలో ఆంతర్యం ఏమిటని justice chandrachud ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి సరిగా లేదని వ్యాఖ్యానించారు. తర్వాత కేసు ఉపసంహరణకు ధర్మాసనం అంగీకరించింది. అకాడమీలో తమకు రావాల్సిన నిధులను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశించారని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ అనంతరం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ. 92 94 కోట్లు చెల్లించామని తెలంగాణ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చిన నేపథ్యంలో మిగిలిన రూ. 32 కోట్లను 6 శాతం వడ్డీతో రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును నెలరోజుల్లో అమలు చేయాలంటే కేసు విచారణ ముగించింది.
కాగా, మార్చి 8న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విభజనలో జాప్యంపై తీవ్ర అసంతృప్తితో ఏపీ సర్కార్.. సుప్రీం కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. కోర్టు ఆదేశాలిచ్చి ఆరు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై సీరియస్‌గా స్పందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
ఇక, తెలుగు అకాడమీ విభజన పూర్తి చేయాలని గతేడాది సెప్టెంబర్ 14న తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు అధికారులు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ. 65 కోట్ల నిధుల గల్లంతు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో తెలుగు అకాడమీ విభజన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. ఏపీ సర్కార్ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది.
ఇక, గతంలో తెలుగు అకాడమీ విభజనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు అధికారులు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ. 65 కోట్ల నిధుల గల్లంతు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో తెలుగు అకాడమీ విభజన ప్రక్రియ నిలిచిపోయింది.