నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై 20 శాతం డిస్కౌంట్..

Published : Apr 30, 2022, 09:22 AM IST
నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై 20 శాతం డిస్కౌంట్..

సారాంశం

తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగ యువతకు బస్ పాస్‌లపై తగ్గింపును ప్రకటించింది. 

తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగ యువతకు బస్ పాస్‌లపై తగ్గింపును ప్రకటించింది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగ యువతకు చేయూత అందించేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. సిటీ  ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌లపై 20 శాతం డిస్కౌంట్ అందించనున్నట్టుగా పేర్కొంది. ఈ రెండు రకాల బస్ పాస్‌లు జంట నగరాల్లోని అన్ని బసు పాస్ కౌంటర్లలో పొందవచ్చని తెలిపింది. 

ఈ రెండు బస్ పాస్‌‌లు పొందడానికి పోటీ పరీక్షల కోసం ట్రైనింగ్ క్లాసులకు హాజరవుతున్నవారిని అర్హులుగా పేర్కొంది. బస్సు పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్‌ కార్డుతో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడి కార్డు జిరాక్స్ లేదా నిర్యుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది. 

ఆర్డినరి బస్ పాస్ మూడు నెలలకు రూ.  3450 కాగా.. దానిపై 20 శాతం డిస్కౌంట్ అనంతరం.. రూ. 2800కు,  మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ రూ. 3900 కాగా.. దానిపై 20 శాతం డిస్కౌంట్ అనంతరం రూ. 3200కు అందించనున్నట్టుగా తెలిపింది. ఇక, ఈ విషయాన్ని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీ తరఫును ఆల్ ది బెస్ట్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్