నివేదికలివ్వండి: కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కార్ పై హైకోర్టు అసంతృప్తి

By narsimha lodeFirst Published May 26, 2020, 5:30 PM IST
Highlights

మార్చి 11వ తేదీ నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.


హైదరాబాద్:మార్చి 11వ తేదీ నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.

మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు  కొట్టివేసింది. కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రెండు సార్లు వచ్చిన లేఖలను సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

also read:ఆరుగురు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గద్వాల గర్భిణీ మృతి: హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై ఈ ఏడాది జూన్ 4వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహణ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

also read:తెలంగాణలో కరోనా విజృంభణ: కొత్తగా 66 కేసులు, ముగ్గురి మృతి...1,920కి చేరిన సంఖ్య

లక్షణాలు లేని హైరిస్క్ ఉన్నవారికి కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాటికి 1920కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో 56 మంది కరోనాతో మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి.

click me!