హైదరాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద టెన్షన్ టెన్షన్

First Published Nov 23, 2017, 3:42 PM IST
Highlights
  • ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
  • గచ్చిబౌలి స్టేడియంలో సన్ బస్ పార్టీ అనుమతి రద్దుకు డిమాండ్

గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్ బన్ పార్టీ కి అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ లోని ఏక్సైజ్ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఇప్పటికే డ్రగ్స్ కేసుల వల్ల హైదరాబాద్ పరువు పోతుంటే మళ్లీ ఇపుడు పార్టీ ల పేరుతో మరింత చెడ్డపేరు తేవొద్దని యూత్ కాంగ్రెస్ సర్కార్ ను సూచించారు. ఇతర రాష్ట్రాలు ఈ పార్టీలను రద్దు చేస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏరికోరి నిర్వహిస్తోందని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. సన్ బన్ పార్టీ వెనుక మంత్రి కేటీఆర్, అతడి బావమరిది హస్తం ఉందని అందువల్లే ప్రభుత్వం వెంటనే దీనికి అనుమతిచ్చందని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు అనిల్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా విజృంభిస్తోందని అన్నారు. నగరంలో డ్రగ్స్ ను అరికడతామని ప్రభుత్వం కొంత మంది సినిమావాళ్లను విచారించి హడావుడి చేసిందే తప్ప అందుకోసం చిత్తశుద్దిగా వ్యవహరించలేదని అన్నారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో సన్ బన్ పార్టీల పేరుతో హడావిడి జరుగుతోందని, ఇలాంటి పార్టీలకు ప్రభుత్వంఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని సర్కర్ రు ప్రశ్నించారు అనిల్. 


క్రీడామైదానాల్లో ఇలాంటి సన్ బన్ పార్టీలు పెట్టడం క్రీడాకారులను అవమానించడమే అవుతుందని అన్నారు. పోలీస్ లు ఈ  పార్టీకి ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి .. ఈ  అనుమతి వెనుక ఎవరి ఒత్తిడి ఉందో పోలీసులు బయటపెట్టాలని డామాండ్ చేశారు. ఈ పార్టీ అనుమతి రద్దు చేయకపోతే  సన్ బన్ పార్టీని యూత్ కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని అనిల్ ప్రభుత్వాన్ని, నిర్వహకులను హెచ్చరించారు.

click me!