జగన్ సీఎం కావాలంటూ.. తెలంగాణ నేతల తిరుమల యాత్ర

Published : Jan 16, 2019, 10:17 AM IST
జగన్ సీఎం కావాలంటూ.. తెలంగాణ నేతల తిరుమల యాత్ర

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లికి చెందిన పలువురు వైసీపీ నేతలు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంగళవారం వేడుకున్నారు.

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్... త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అదిరోహించాలని తెలంగాణనలోని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లికి చెందిన పలువురు వైసీపీ నేతలు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంగళవారం వేడుకున్నారు. ఆపార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ ఆధ్వర్యంలో పలువురు నేతలు తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. అదేవిధంగా జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తయినందున.. మెట్లమార్గంలో కొండపైకి చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!