ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్.. గాయాలతో, స్పృహలేని స్థితిలో గుర్తింపు..

Published : Jul 05, 2021, 03:40 PM IST
ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్.. గాయాలతో, స్పృహలేని స్థితిలో గుర్తింపు..

సారాంశం

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి దమ్మాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. తాపీ మేస్త్రీ శ్రీను నిన్న సాయంత్రం ఆరేళ్ల బాలికను అపహరించాడు. ఈ ఉదయం చిన్నారిని ప్రగతినగర్ లో వదిలిపెట్టాడు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి దమ్మాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. తాపీ మేస్త్రీ శ్రీను నిన్న సాయంత్రం ఆరేళ్ల బాలికను అపహరించాడు. ఈ ఉదయం చిన్నారిని ప్రగతినగర్ లో వదిలిపెట్టాడు.

ఒంటిమీద గాయాలతో, స్పృహలేని స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు. అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బాలిక అదృశ్యంమీద తల్లిదండ్రులు నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చర్యల్లో ఉండగా స్థానికులు ద్వారా పోలీసులకు బాలిక సమాచారం అందించింది. 
 
PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు