అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలంగాణ ఘనత

Published : Oct 27, 2018, 04:37 PM IST
అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలంగాణ ఘనత

సారాంశం

తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన " విజిట్ తెలంగాణ " ఫిల్మ్ కు  'బెస్ట్ ఆసియన్ ఫిల్మ్ అవార్డు' దక్కింది

యూరోప్ లోని పోర్చుగల్ లో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన " విజిట్ తెలంగాణ " ఫిల్మ్ కు  'బెస్ట్ ఆసియన్ ఫిల్మ్ అవార్డు' దక్కింది. ఈ అవార్డుని తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, షాట్ ఫిల్మ్ మేకర్ సత్యనారాయణ అందుకున్నారు.

ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ..అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్ లో ఇండియా లోనే తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మొదటిసారిగా' బెస్ట్ ఆసియన్ టూరిజం ఫిల్మ్' అవార్డు సాదించిందన్నారు.  

గత సంవత్సరం అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్ లో తెలంగాణ పర్యాటక శాఖ 'బెస్ట్ లొకేషన్స్' విభాగంలో ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నట్లు వెల్లడించారు.అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్ ను హైదరాబాద్ నగరంలో నిర్వహించటానికి టూరిజం  ఫెస్టివల్ నిర్వాహకులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. త్వరలో 'అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ 'నిర్వాహకుల బృందం హైదరాబాద్ నగరంలో  పర్యటించటానికి వస్తారని వివరించారు. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu