రైతుల జోలికి వస్తే కేంద్రాన్ని తెలంగాణ మట్టి క్షమించదు: మంత్రి కేటీఆర్ వార్నింగ్

By Mahesh KFirst Published Oct 14, 2022, 9:10 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికి వస్తే తెలంగాణ ఊరుకోదని, కేంద్రాన్ని తెలంగాణ మట్టి క్షమించదని మంత్రి కేటీఆ్ అన్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ భూతాన్ని సీఎం కేసీఆర్ వెళ్లగొట్టారని తెలిపారు. ఆడపడచుల బాధలు తీర్చడానికి ఇంటికే తాగు నీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభించారని వివరించారు.
 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికి వస్తే తెలంగాణ మట్టి క్షమించదని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారదోలింది కేసీఆర్ ప్రభుత్వం అని వివరించారు. నల్లగొండను దేశానికే ధాన్యపు కొండను చేసిందని తెలిపారు. ఆయన శుక్రవారం ప్రగతి భవన్‌లో మాట్లాడారు. జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో తెచ్చిన ‘రైతుల జోలికొస్తే ఊరుకోం’ అనే పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో సాగు, తాగు నీరు అందిస్తూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ గ్రామీణాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లుతున్నారని వివరించారు.

నల్లగొండ కోసుల కొద్దీ బిందెలు పట్టుకుని అమ్మలు, అక్కలు మంచినీళ్ల కోసం నడిచి వెళ్లేవారని, ఆడపడుచుల బాధలు తీర్చడం కోసం ఇంటికి మంచి నీళ్లు అందించే మిషన్ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ నుంచే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.

Also Read: నాడు ఇల్లు కట్టించిండు... నేడు అదే ఇంట్లో చేయి కడిగిండు, కేటీఆర్ వ్యక్తిత్వంపై ప్రశంసలు

ప్రజల అజెండానే దేశ జెండాగా చేసుకుని కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారానికి అడుగు వేస్తున్నారని కేటీఆర్ అన్నారు. దార్శినక ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్లుతున్నారని తెలిపారు. దేశంలో కుల మతాలు, భాషా ఆదిపత్యాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్ జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ కుట్రను తెలంగాణ అడ్డుకుని తీరుతుందని చెప్పారు. ఒక వర్గంపై మరో వర్గపు వ్యవహారాలను రుద్ది ఆధిపత్యాలను చేలాయించే వికృత సంస్కృతికి చరమగీతం పాడాలని, లేకుంటే దేశం అల్లకల్లోలం అవుతుందని తెలిపారు.

click me!