
మునుగోడు ఉపఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు షాకిచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత బీజేపీ నేతలతో బూర నర్సయ్య గౌడ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న నర్సయ్య గౌడ్.. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌తో భేటీ అయ్యారు. ఆ వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని సమాచారం.