Golden Gift: అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర.. ఆ చీరె ప్రత్యేకతలెంటో తెలుసా?

By Rajesh Karampoori  |  First Published Jan 19, 2024, 2:48 AM IST

Ayodhya Ram Mandir: అయోధ్యలోని బాలరాముడికి తెలంగాణ నుంచి మరో అరుదైన బహుమతి అందనున్నది. శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు.


Golden Saree: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుత తరుణం రానే వచ్చింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరవేగంగా  సాగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన  బాలరాముడు శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే ప్రజలంతా రామనామస్మరణలో మునికి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనుంది.

ప్రాణ ప్రతిష్ట మహాత్సవ కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. దేశవిదేశాలను భక్తులు రామయ్యకు భారీ, విలువైన బహుమతులు అందజేస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య శ్రీరామచంద్రుడి తెలంగాణ నుండి అపూర్వ కానుక అందనుంది. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తాను స్వయంగా తయారు చేసిన బంగారు చీరను.. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. 

Latest Videos

undefined

ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. అక్కడ హరి ప్రసాద్  తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. ఈ చీర తయారీ కోసం 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించనున్నట్టు  తెలిపారు. ఈ సందర్భంగా ఈ చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను బండి సంజయ్ అభినందించారు. 

అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ...అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్   తయారు చేసిన  బంగారు చీర చాలా బాగుందన్నారు. ఈనెల 26న ఆ చీరను ప్రధానికి అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు.

click me!