తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వేడితో ఉక్కపోస్తుంటే.. రాత్రి సమయంలో చలి గజ గజ వణికిస్తోంది. ఈ వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
telangana weather : తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ నెలకొంది. పగలంతా ఎండ వేడితో ఉక్కపోతగా ఉంటోంది. అలాగే రాత్రయితే చాలు విపరీతమైన చలిపెడుతోంది. ఈ భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు కాస్త అసౌకర్యానికి లోనవుతున్నారు. రాత్రి సమయంలో వాతావరణంలో తేమ శాతం పెరగడం, పగటి సమయంలో అందులో సగానికి సగం పడిపోవడమే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వస్తున్నారు.
విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి కుటుంబ సభ్యుల సూసైడ్.. కారణమేంటంటే ?
కాగా.. గడిచిన 24 గంటల్లో ఖమ్మంలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీనిని బట్టే పగలు, రాత్రి సమయంలో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజధాని హైదరాబాద్ లో కూడా ఇలాంటి వాతవరణమే కనిపిస్తోంది. ఇక్కడ అత్యధికంగా 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యత్పంగా 2.1 డిగ్రీలు నమోదు అయ్యింది.
నిజామాబాద్ లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలకు పడిపోయింది. అయితే పగటి పూట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదు అయ్యింది. భద్రాచలంలో కూడా అత్యల్పంగా 1.8 డిగ్రీలు నమోదు అయ్యింది. మధ్యాహ్నం సమయంలో 33.4 నమోదైంది. ఇక ఆదిలాబాద్ లో పగటి పూట ఉష్ణోగ్రత అధికంగానే ఉంటోంది. ఇక్కడ కూడా 32.3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. అయితే ఒక్క నల్గొండలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.