రూ.75 వేల లంచం: గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎం అరెస్టు

By telugu teamFirst Published Jan 21, 2021, 6:50 AM IST
Highlights

లంచం తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలను అరెస్టు చేశారు. వారిద్దరు రూ.75 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

హైదరాబాద్: లంచం తీసుకున్న కేసులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారిని, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు అరెస్టు చేశారు. గిడ్డంగుల సంస్థలో గ్రేడ్ -1 మేనేజర్ గా పనిచేసి, పదవీ విరమణ చేసిన సుందర్ లాల్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి వారిద్దరు లంచం డిమాండ్ చేసినట్లు తేలింది.

తమకు రూ.75 లంచం ఇవ్వాలని భాస్కరాచారి, సుధాకర్ రెడ్డి డిమాండ్ చేయడంతో సుందర్ లాల్ ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు బుధవారం సుందర్ లాల్ రూ.75 వేల నగదును సుధాకర్ రెడ్డికి ఇచ్చాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు తొలుత సుధాకర్ రెడ్డిని, ఆ తర్వాత భాస్కరాచారిని అరెస్టు చేశారు. డబ్బులు స్వాధీనం చేసుకున్నాడు.

సుధాకర్ రెడ్డిని, భాస్కరాచారిని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఏసీబీ అధికారులు ఆ ఇద్దరు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సుందర్ లాలక్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 6 నెలలుగా తిప్పించుకుంటున్నారని, రూ. లంచం డిమాండ్ చేశఆరని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. 

సుందర్ లాల్ గతంలో కరీంనగర్ ఏసీబీ కేసులో ఉండడాన్ని కారణంగా చూపి అతని ఫైల్ ను ముందుకు కదలనివ్వలేదని, దాంతో బాధితుడు తమని ఆశ్రయించాడని ఆయన చెప్పారు. 

click me!