ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం: మంత్రి హరీశ్ రావు

By Mahesh RajamoniFirst Published Oct 1, 2022, 2:30 PM IST
Highlights

Hyderabad: ఫుడ్‌ సేఫ్టీ విభాగంలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నియామకాలు జరిగేంత వరకు ఫుడ్‌ సేఫ్టీ వింగ్‌ను నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
 

Health minister T Harish Rao: ఫుడ్‌ సేఫ్టీ విభాగంలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నియామకాలు జరిగేంత వరకు ఫుడ్‌ సేఫ్టీ వింగ్‌ను నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వివరాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా రాష్ట్రంలోని ఫుడ్‌ సేఫ్టీ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నియామకాలు జరిగే వరకు ఆహార భద్రత విభాగాన్ని నిర్వహించాలని ఆయన ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆహార భద్రతపై ఆరోగ్యశాఖ అధికారులు తప్పనిసరిగా శిక్షణ పొందాలన్నారు.

ఆహార భద్రతపై అవగాహన కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని మంత్రి అధికారులను కోరారు. "వారు ఇతర రాష్ట్రాలను కూడా సందర్శించి అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలి. ఒక వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలి. తద్వారా వాటిని మన రాష్ట్రంలో కూడా వర్తింపజేయవచ్చు" అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అలాగే, "కల్తీ ఆహారం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణశయాంతర, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది" అని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేయాలని ప్రజలను కోరారు.

కాగా, అంత‌కుముందు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు వేధింపులకు గురవుతున్నారని, కేంద్ర నిధుల కోసం ఏపీ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్‌లకు మీటర్లు బిగిస్తున్నదని తెలంగాణ మంత్రి టీ.హరీశ్‌రావు చేసిన ప్రకటన ఏపీ రాజ‌కీయాల్లో కలకలం రేపింది. పలువురు ఏపీ మంత్రులు, వైఎస్సార్సీ నేతలు హరీష్‌రావు పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.  రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత పరిస్థితులను పోల్చి చూసేందుకు తాము మంచి స్థితిలో ఉన్నామని టీఎస్ టీచర్ల తో హరీశ్ రావు చెప్పారు. “మీరు మీ స్నేహితులతో (ఏపీలో) మాట్లాడితే, కేసులు ఎలా నమోదు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది” అని ఆయన అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారు. టీఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు వారి జీతంలో 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ హ‌రీష్ రావుపై మండిప‌డ్డారు. తెలంగాణ రాజకీయాల్లోకి ఏపీని లాగవద్దన్నారు. ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. అలాగే, జగన్‌ని టార్గెట్‌ చేసిన 'గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌' ఆశయం మేరకు హరీష్‌రావు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో వెయ్యి సమస్యలు ఉండవచ్చు కానీ వాటి గురించి మాట్లాడటం మా పని కాదు అంటూ విమ‌ర్శించారు. పాలనపై దృష్టి సారించాలని హరీశ్‌రావుకు సలహా ఇచ్చిన రామకృష్ణారెడ్డి.. ఏపీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టి చంద్రశేఖర్‌రావుపై దాడికి పాల్పడే పెద్ద కుట్రలో భాగంగానే హరీశ్‌రావు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని అన్నారు. “కేసీఆర్‌తో సహా ఎవరితోనూ అనవసరమైన వివాదానికి దిగడానికి మేము సిద్ధంగా లేము” అని రామకృష్ణారెడ్డి అన్నారు. 

click me!