విద్యార్ధి సంఘాల ఆందోళన: తెలంగాణ యూనివర్శిటీ వీసీ సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Oct 18, 2021, 2:47 PM IST
Highlights

తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్ధి సంఘాలతో కలిసి కొందరు ప్రొఫెసర్లు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రొఫెసర్ శివశంకర్ ను రీకాల్ చేస్తామన్నారు.

నిజామాబాద్: కొందరు ప్రొఫెసర్లు విద్యార్ధి సంఘాలతో కలిసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ యూనివర్శిటీ  వైస్ ఛాన్సిలర్  రవీందర్ ఆరోపించారు.Telangana Universityకి దళితుడిని రిజిస్ట్రార్‌గా చేశానని ఆయన చెప్పారు. ఇది నచ్చని కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ యూనివర్శిటీలో నియామాకాలపై గొడవ కొనసాగుతుంది. అక్రమంగా యూనివర్శిటీలో నియామాకాలు చేపట్టారని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తూ ఇవాళ విద్యార్ధి సంఘాలు  సోమవారం నాడు ఆందోళన చేశాయి.వీసీ చేసిన అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని విద్యార్ధి సంఘాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా వీసీ రవీందర్ గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు.

also read:Bathukamma Celebrations : తెలుగు యూనివర్సిటీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళి సై..

తెలంగాణ యూనివర్శిటీలో ఉన్న ఈసీ మెంబర్లు కూడ తనకు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. యూనివర్శిటీ కార్యకలాపాలు సాగకుండా ఇబ్బందులు సృష్టిస్తున్న ప్రొఫెసర్ శివశంకర్‌ను రీకాల్ చేస్తామని ఆయన ప్రకటించారు.తెలంగాణ యూనివర్శిటీ వీసీగా రవీందర్ ఈ ఏడాది మే 24న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలకు ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సిలర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.  మే మాసంలో రాష్ట్రంలోని 10 యూనివర్శిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది.

రవీందర్ యాదవ్ (ఉస్మానియా యూనివర్శిటీ),కట్టా నర్సింహ్మరెడ్డి (జేఎన్‌టీయూ), టి.రమేష్(కాకతీయ యూనివర్శిటీ) సీతారామారావు (డాక్టర్ అంబేద్కర్ యూనివర్శిటీ) టి.కిషన్ రావు(పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ) లక్ష్మావత్ రాథోడ్ (పాలమూరు యూనివర్శిటీ)సిహెచ్ గోపాల్ రెడ్డి( మహాత్మాగాంధీ యూనివర్శిటీ)మల్లేశం (శాతవాహన యూనివర్శిటీ) కవిత(జేఎన్‌ఎప్ఏయూ) వీసీలుగా నియమించారు.


 

click me!