కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ టంతో వేగంగా కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాలని, తద్వారా కరోనాను కట్టడి చేయాలని నిర్ణయిం చింది.
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరికి ఎటు నుంచి వైరస్ సోకుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే 40వేల కేసులకు దగ్గరయ్యింది. అయితే.. తెలంగాణలో అనుకున్న స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరగడం లేదంటూ ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. ప్రతిపక్షాల నుంచి హైకోర్టు వరకు ఈ విషయంలో తెలంగాణ సర్కార్ ని తప్పుపట్టాయి. ఈ క్రమంలో... కేసీఆర్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది.
కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ టంతో వేగంగా కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాలని, తద్వారా కరోనాను కట్టడి చేయాలని నిర్ణయిం చింది. అందుకోసం 5లక్షల కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయాలని అత్యంత కీలక నిర్ణ యం తీసుకుంది. రానున్న కొద్ది రోజుల్లో కనీసం 5లక్షల ర్యాపిడ్ టెస్టులను నిర్వహించాలని భావిస్తోంది.
undefined
దీనిలో భాగంగా.. ఈ కిట్స్ ని సౌత్ కొరియా నుంచి తెప్పిస్తున్నారు. ఆ కిట్స్ రాష్ట్రానికి చేరుకోగానే.. వెంటనే పని మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్యశాఖ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
ఒక్కసారి కిట్స్ రాష్ట్రంలోకి అడుగుపెడితే.. కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే కాకుండా.. జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ ల్లోనూ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.