జీహెచ్ఎంసీలో కరోనా ఉగ్రరూపం : తెలంగాణలో కొత్తగా 1,478 కేసులు.. 42 వేలకు చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Jul 17, 2020, 10:37 PM IST
Highlights

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1,478 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కి చేరుకుంది

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1,478 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కి చేరుకుంది.

కాగా ఇవాళ ఒక్క రోజే 1,410 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 28,705కు చేరింది. శుక్రవారం వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 403కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 13,389 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

హైదరాబాద్‌లో 806 మందికి పాజిటివ్‌గా తేలగా.. రంగారెడ్డి 91, మేడ్చల్ 82, సంగారెడ్డిలో 30, కామారెడ్డి 31, కరీంనగర్ 77, పెద్దపల్లి 35, మెదక్ 23, నల్గొండ 35, సిరిసిల్ల 27, నాగర్‌కర్నూలు 23, నిజామాబాద్ 11, సూర్యాపేట 20, జనగాం 10, వికారాబాద్ 17, నారాయణపేట 14 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

కరోనా రోగుల పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రతపై ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ భయంతో ప్రజలు హైరానా పడి ప్రైవేట్ ఆసుపత్రులకు పోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్ధితి నెలకొందని, వైరస్ విషయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాల్సిందేనని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో భయంకరమైన పరిస్థితి లేదని, అలాగని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కేసీఆర్ సూచించారు. 

click me!