మా చేపలు మాకు పంచాల్సిందే: సీఎం కేసీఆర్

First Published Jan 3, 2017, 9:03 AM IST
Highlights

నాగార్జున సాగర్‌, శ్రీశైలం, పులిచింతలలో తెలంగాణ మత్స్యసంపద వాట తేల్చాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

 

సమైక్య రాష్ట్రంలో చేపలు కూడా తెలంగాణ దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ...  సమైక్య రాష్ట్రంలో చేపలు, చేపల పరిశ్రమ అంటే ఏపీ అనే భావన ఉండేదని అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో చేపల పెంపకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

 

గతంలో ప్రతీ చెరువులో చేపల పెంపకం ఉండేదని, సమైక్య పాలనలో చెరువుల విధ్వంసంతో చేపల పెంపకం కూడా ఆగిపోయిందని గుర్తు చేశారు.

ఫిషరీస్ డెవలప్మెంట్ ఫెడరేషన్లో ఉద్యోగులకు పనీ లేదని విమర్శించారు.

 

నాగార్జున సాగర్‌, శ్రీశైలం, పులిచింతలలో తెలంగాణ మత్స్యసంపద వాట తేల్చాలని డిమాండ్ చేశారు. ఫిషరీస్ డెవలప్మెంట్ ఫెడరేషన్‌ను పటిష్టం చేస్తామని అన్నారు.

 

వచ్చే ఏడాది రెండు ఫిషరీస్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఫిషరీస్ కార్పొరేషన్‌లో ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు.

click me!