(వీడియో) డిఎస్ సి ధర్నా : కెసిఆర్ సారూ, నోటి ఫికేషన్ ఎపుడిస్తారు?

First Published Apr 10, 2017, 7:40 AM IST
Highlights

మూడేళ్లుగా సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నుంచి ఎమ్మెల్యే వరకు డీఎస్సీ పై చేసిన ప్రకటనలు లెక్కపెడితే వందలు దాటి ఉంటాయి.

డిఎస్ సి హామీ నెరవేరుతుందన్న ఓపిక నశిస్తూ ండటంతో ఈ నిరుద్యోగ యువకులు ఇలా రోడ్డెక్కారు.

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియా మకాలు చేపట్టి, నిరుద్యోగులను ఆదుకోవాలని ఈ రోజు హైదరాబాద్ లో ధర్న నిర్వహించారు.  ఈ వీడియో చూడండి. డిఎస్ సి బతుకు దెరువు నిస్తుందని ఆశపడి దగాపడ్డ యువతీ యువకులు ఏ నినాదాలు చేస్తున్నారో.


డీఎస్సీ కి ఉండే పోటీ అంతా ఇంతా కాదు. అందుకే దాన్ని తెలుగు సివిల్స్ అంటుంటారు. అలాంటి టీచర్ పోస్టుల ప్రకటన కోసం అభ్యర్థులు ఐదేళ్లుగా వేచిచూస్తున్నారు. 
సర్కారు మాత్రం ఇదిగో డీఎస్సీ అంటూ ప్రకటనలకే ఇన్నాళ్లు పరిమితమైంది తప్పితే చిత్తశుద్దితో నియామకాలపై ఒక్కసారి కూడా దృష్టిసారించలేదు.


అసలు డీఎస్సీ భర్తీ ప్రక్రియే ఇప్పుడో ప్రవహసనంగా మారింది. బీఎడ్ చేయాలి.. టెట్ లో క్వాలిఫై అవ్వాలి ఆ తర్వాత గట్టి పోటీ ఉండే డీఎస్సీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలి.
అయినా అభ్యర్థులకు ఈ పరీక్షలేవీ కష్టంగా కనిపించడం లేదు.

 

సర్కారు చెబుతున్న ఊరించే ప్రకటనలే వాళ్లకు పెద్ద పరీక్షగా కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లుగా సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నుంచి ఎమ్మెల్యే వరకు డీఎస్సీ పై చేసిన ప్రకటనలు లెక్కపెడితే వందలు దాటి ఉంటాయి.

 

డిఎస్ సి హామీ నెరవేరుతుందన్న ఓపిక నశిస్తూ ండటంతో ఈ నిరుద్యోగ యువకులు ఇలా రోడ్డెక్కారు.
 

click me!