
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ను మరో కారు ఢీకొట్టింది.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటీపాముల వద్ద ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని కారే మంత్రి కారును ఢీకొట్టడంతో రెండు కార్లు స్వలంగా దెబ్బతిన్నాయి.
జగదీశ్వర్ రెడ్డి ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే కాన్వాయలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.