టిడిపి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్...కేసీఆర్ చేసిందేమి లేదు : ఎల్.రమణ

By Arun Kumar PFirst Published Sep 6, 2018, 6:05 PM IST
Highlights

తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మిగులు బడ్జెట్ లో వున్న రాష్ట్రాన్ని కాస్తా అప్పుల ఊబిలోకి నెట్టారని టిటిడిపి అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. ఇలా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడటానికి తెలుగు దేశం పార్టీ పాలన కాలంలో చేపట్టిన సంస్కరణలే కారణమన్నారు.  తెలుగు ప్రజల కోసం ఆర్థిక, పరిపాలన, విద్యుత్ సంస్కరణలు చేపట్టిన ఘనత టిడిపి పార్టీకే దక్కుతుందన్నారు రమణ. 
 
ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు తదితర అంశాల కారణంగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సందర్భంగా టిటిడిపి పార్టీ కూడా ముందస్తు ఎన్నికల కోసం పలు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన పరిణామాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఎల్.రమణ విరుచుకుపడ్డారు. 

కేసీఆర్ తన 51 నెలల పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రైతుల రుణమాపీ, ఫించను పెంపు వంటి పథకాలను టిడిపి నుండి కాఫీ కొట్టి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికల మేనిపెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పిన కేసీఆర్ అందులో పేర్కొన్న ఏ పథకాలను పూర్తిగా అమలు చేశారో చెప్పాలని రమణ ప్రశనించారు.

2014 లో మీకోసం వస్తున్నా పాదయాత్ర ద్వారా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పేదల మన్ననలు పొందారని రమణ ప్రశంసించారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ సుపరిపాలన సాగిస్తోందన్నారు. 

click me!