పెళ్లిలో కరోనా సూపర్ స్ప్రెడ్.. 100మందికి పాజిటివ్, నలుగురి మృతి

By telugu news teamFirst Published May 28, 2021, 9:43 AM IST
Highlights

ఈ పెళ్లి లో కరోనా కాటువేసింది. ఈ పెళ్లికి హాజరైన దాదాపు 100మంది అతిథులు కరోనా బారినపడ్డారు. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా మహమ్మారి రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఓ పెళ్లి కారణంగా కరోనా సూపర్ స్ప్రైడ్ గా మారి 100మందికి పాజిటివ్ గా తేలింది. అంతేకాకుండా.. వారిలో నలుగురు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా ముత్యాలగూడెం గ్రామానికి చెందిన ఓ జంట ఈ నెల 14వ తేదీన పెళ్లి తో ఒక్కటైంది. ఈ పెళ్లి లో కరోనా కాటువేసింది. ఈ పెళ్లికి హాజరైన దాదాపు 100మంది అతిథులు కరోనా బారినపడ్డారు. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో.. పెళ్లికొడుకు తండ్రి కూడా ఉండటం గమనార్హం.

పెళ్లికి మొత్తం 250మంది హాజరుకాగా.. వారిలో 100మంది కరోనా బారినపడటం గమనార్హం. బుధవారం ఈ కరోనా సోకినవారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఆ చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, గ్రామస్థులు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

దీంతో... ఆ గ్రామం పక్కనే ఉన్న కారేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన స్థానికులు వారి అంత్యక్రియలు నిర్వహించారు. మిగిలిన కరోనా బాధితులంతా హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం కేవలం 100మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా...అది పట్టించుకోకుండా.. ఎక్కువ మంది హాజరయ్యారు. వారిలో  చాలా మంది కనీసం మాస్క్ లు కూడా ధరించలేదని అక్కడి వారు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే.. ఇలా ఇంత మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. 

click me!