తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి: నోటిఫికేషన్ విడుదల

By Nagaraju penumalaFirst Published Apr 20, 2019, 4:46 PM IST
Highlights

మెుదటవిడతలో భాగంగా శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో శనివారం ఏప్రిల్ 20 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మెుత్తం  539 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మండపేట మినహా 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడికి రంగం సిద్ధమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. 

మెుదటవిడతలో భాగంగా శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో శనివారం ఏప్రిల్ 20 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మెుత్తం  539 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మండపేట మినహా 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

అలాగే 5857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. ఇకపోతే మెుదటి దశలో197 జెడ్పీటీసీ స్థానాలకు, 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. 

రెండోదశలో 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు, ఇకపోతే మూడోదశలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి లక్ష 47 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

అలాగే 32వేల పోలింగ్ బూత్ లలో ఎన్నికలు నిర్వహిస్తుండగా 26 వేల మంది పోలీసులు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఆన్ లైన్లో నామినేషన్ వేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. 

హైకోర్టు ఆర్డర్ ఉండటం వల్లే మండపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా వేసినట్లు తెలిపారు. ఇకపోతే ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ గరిష్ట వ్యయ పరిమితి రూ.4లక్షలు కాగా ఎంపీటీసీ గరిష్ట వ్యయపరిమితి రూ.1.50 లక్షలుగా నిర్ధారించినట్లు తెలిపారు. 

శనివారం నుంచి పంచాయితీరాజ్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు తెలిపారు కమిషనర్ నాగిరెడ్డి. ఇకపోతే పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ లో జెడ్పీటీసీ ఎన్నికలు, వైట్ బ్యాలెట్ పేపర్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. 
 

click me!