TSLPRB: 554 ఎస్సై పోస్టులకు 2.25 లక్షల మంది అభ్య‌ర్థుల పోటీ !

By Mahesh RajamoniFirst Published Aug 8, 2022, 12:57 AM IST
Highlights

Sub Inspector posts: 554 ఎస్సై పోస్టులకు 2.25 లక్షల మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. వికారాబాద్‌లో అత్యధికంగా (95.87%) అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, మిర్యాలగూడలో 95.65%, హనుమకొండలో 95.19% మంది హాజరయ్యారు.
 

Telangana State Level Police Recruitment Board: తెలంగాణ‌లో చాలా రోజుల త‌ర్వాత ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వ‌స్తున్నాయి. దీంతో ఉద్యోగాల‌కు కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది రాత్రిభ‌వ‌ళ్లు  త‌మ ప్రిప‌రేష‌న్ ను కొన‌సాగిస్తున్నారు. ఇక పోలీసు ఉద్యోగాల‌కు కూడా నోటిఫికేష్ జారీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) స్టైపెండరీ క్యాండిడేట్ ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్, equivalent posts ల కోసం ఆదివారం నాడు ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించింది. 554 ఎస్సై పోస్టులకు 2.25 లక్షల మంది అభ్య‌ర్థుల ప‌రీక్ష‌లు రాశార‌ని పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) స్టైపెండరీ క్యాండిడేట్ ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్, equivalent posts ల కోసం ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో SCT SI (సివిల్), సంబంధిత స‌మాన హోదాలో 554 ఖాళీలు ఉన్నాయి. దీని కోసం 2, 47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని 503 కేంద్రాలతో పాటు తెలంగాణలోని 35 పట్టణాల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం 2, 25,759 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు .

వికారాబాద్‌లో అత్యధికంగా (95.87%) అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, మిర్యాలగూడలో 95.65%, హనుమకొండలో 95.19% మంది హాజరయ్యారు. "ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రణాళికాబద్ధమైన షెడ్యూల్ ప్రకారం, అన్ని నిబంధనలను అమ‌లు చేస్తూ.. స‌జావుగా నిర్వహించబడింది. తదుపరి ప్రక్రియను సులభతరం చేయడానికి అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ వేలిముద్రలు-డిజిటల్ ఫోటోగ్రాఫ్‌లతో సహా పరీక్ష సమయంలో సంబంధిత వివ‌రాలు తీసుకున్నాం” అని TSLPRB చైర్మన్ VV శ్రీనివాసరావు తెలిపారు.  పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ కొద్ది రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ ఆదివారం సందర్శించారు. మీర్‌పేట్‌లోని టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందూ కళాశాలలను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో భగవత్ మాట్లాడుతూ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాచకొండలోని 55 కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించామన్నారు. అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూడకుండా పీఈటీ, మెయిన్స్ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాలని  సూచించారు. ఎందుకంటే పోటీ తీవ్రంగా ఉంద‌నీ, 2 లక్షల మందికి పైగా అభ్య‌ర్థులు పోస్టుల కోసం పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. 

కాగా, పరీక్ష జరిగిన కూకట్‌పల్లి, దుండిగల్‌, బాచుపల్లి కేంద్రాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సందర్శించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 55 కేంద్రాల్లో పరీక్ష జరగ్గా దాదాపు 39 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కోసం తెలంగాణ పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల వద్ద తగిన బందోబస్త్ ఏర్పాట్లు చేసింది.

Telangana State Level Police Recruitment Board of SI preliminary exam that was held today, Cyberabad CP Shri Stephen Raveendra IPS, personally visited and inspected the exam centers that were located within Cyberabad limits. pic.twitter.com/DCd4E72WlI

— Cyberabad Police (@cyberabadpolice)

 

 

click me!