రేపు స్పీకర్‌ను కలుస్తా.. ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే ఒకే, లేదంటే రెండ్రోజులైనా వెయిట్ చేస్తా : రాజగోపాల్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 7, 2022, 9:22 PM IST
Highlights

రేపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన కోసం రెండ్రోజులైన వెయిట్ చేస్తానని ఆయన చెప్పారు. స్పీకర్ కలవకపోతే అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రం ఇస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 

రేపు స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇస్తే వెళ్లి తన రాజీనామాను ఆమోదించుకుంటానని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్పీకర్ అందుబాటులోకి రాకపోతే మరో రోజు రాజీనామాను అందజేయడానికి సమయం తీసుకుంటానని ఆయన తెలిపారు. రెండు మూడు రోజులైనా సరే తన రాజీనామాను ఆమోదించుకుంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్ కలవకపోతే అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రం ఇస్తానని చెప్పారు. 

ఇకపోతే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ రోజున తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఢిల్లీలో శుక్రవారం అమిత్ షాను కలిసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని.. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు. మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. 

ALso Read:పీసీసీ చీఫ్‌గా నాకే ఎన్నోసార్లు కుర్చీ ఇవ్వలేదు.. రాజగోపాల్ రెడ్డికి నామోషీనా : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

మరోవైపు.. పార్టీ మారుతున్న వాళ్లపై కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy)  . బీజేపీ (bjp) ఇంకొంత మంది కోవర్టులను తయారు చేయొచ్చని ఆయన ఆరోపించారు. కండువా కప్పుకున్నాక పరిస్ధితి ఎలా వుంటుందో చూడాలని రేవంత్ వ్యాఖ్యానించారు. స్థాయి లేకపోయినా వేదికపై కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటారని ఆయన ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్‌గా నాకే చాలాసార్లు కుర్చీ ఇవ్వరని, కానీ కాంగ్రెస్‌లో స్వేచ్ఛ వుంటుందని రేవంత్ అన్నారు. రాజకీయాల్లో సందర్భాలు... పదవులు మారుతాయని చెప్పారు. గుర్తింపు, హోదా ఇచ్చిన పార్టీలో పనిచేయడానికి రాజగోపాల్ రెడ్డికి (komatireddy raja gopal reddy) నామోషీనా అని రేవంత్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ను (congress) విధ్వంసం చేయాలనేది బీజేపీ కుట్ర అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో (chandrababu naidu) కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు.. తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కష్టాల్లో వున్నప్పుడు తాను విడిచిపెట్టలేదని... ఆయన ఏపీ సీఎంగా, ఎన్డీయేలో వున్నప్పుడు గౌరవప్రదంగా కలిసి టీడీపీని వీడానని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు. తెలుగుదేశానికి రాజీనామా చేసిన రోజున గన్‌మెన్‌లను, పీఏని, అసెంబ్లీ అధికారులు ఇచ్చిన బ్యాంక్ ఖాతాను కూడా క్లోజ్ చేశానని రేవంత్ గుర్తుచేశారు. 
 

click me!