
హైదరాబాద్‌లో (hyderabad) కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ భూమినే (land occupied) కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌లో (kutbullapur) వున్న స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (telangana state finance corporation) భూములను కొందరు ఆక్రమించుకున్నారు. ఈ విషయం తెలుసుకుని కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఎఫ్‌సీ అధికారులపై కబ్జాదారులు దాడికి దిగారు. మట్టిని చదును చేసేందుకు ఉపయోగిస్తున్న లారీని సీజ్ చేశారు అధికారులు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఫోన్లను లాక్కున్నారు కబ్జాదారులు. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు.