TS SSC Exams 2024: పదో తరగతి విద్యార్థులకు గమనిక .. పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. తేదీలు ఇవే

By Rajesh Karampoori  |  First Published Dec 31, 2023, 1:25 AM IST

TS SSC Exams 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షల (Tenth exams )షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.  పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయంటే..?


TS SSC Exams 2024:తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ (Tenth exams ) విడుదలైంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎస్ఎస్సీ) శనివారం (డిసెంబర్‌ 30) సాయంత్రం పదో పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాశాఖ  విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. SSC పరీక్షలు మార్చి 18 (సోమవారం) ప్రారంభమై.. ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. అభ్యర్థులందరూ తమ తమ పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూసుకోవాలని సూచించారు. 

విద్యాశాఖ  విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. 18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు, కాంపోజిట్ కోర్సు), 19న సెకండ్‌ లాంగ్వేజ్‌, 21న ఇంగ్లిష్‌, 23న మ్యాథ్స్‌, 26న సైన్స్‌ పేపర్ 1 (ఫిజిక్స్), మార్చి 28న సైన్స్ పేపర్ 2 (బయోలజీ), 30న సోషల్‌ స్టడీస్‌, 1వ తేదీన ఒకేషనల్‌ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్‌‌, 2న రెండవ పేపర్‌ పరీక్షలు జరుగనున్నాయి.

Latest Videos

టైమ్ టేబుల్‌లో పేర్కొన్న ఏదైనా తేదీల్లో ప్రభుత్వం పబ్లిక్ హాలిడే లేదా సాధారణ సెలవులు ప్రకటించినప్పటికీ.. మార్చి 2024 SSC పబ్లిక్ పరీక్ష ఖచ్చితంగా టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించబడుతాయని విద్యాశాఖ పేర్కొంది. అలాగే..  ఈసారి పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పరీక్ష సెంటర్ ల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే.. కఠినంగా వ్యవహరించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

"లక్ష్య' కార్యక్రమం

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో రాణించేందుకు  విద్యాశాఖ 'లక్ష' కార్యక్రమాన్ని ప్రారంభించింది. యాక్షన్ ప్లాన్‌లో జనవరి 10 నాటికి సిలబస్‌ను పూర్తి చేయాలని, వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్రత్యేక తరగతులను పరీక్షల వరకు పొడిగించాలని ఆదేశించింది.

విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని,  ప్రతిభ ఆధారంగా విద్యార్థులను  A,B,  C గ్రూపులుగా వర్గీకరించాలని పేర్కొంది. పరీక్షకు ముందు మూల్యాంకనాలు, కౌన్సెలింగ్, ఒత్తిడిని తగ్గించేలా ప్రేరణాత్మక తరగతులు నిర్వహించనున్నారు.   వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్  అందించనున్నారు.

click me!