తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. లోపమంతా సాఫ్ట్ వేర్ లోనే..

By telugu teamFirst Published Apr 26, 2019, 10:03 AM IST
Highlights

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. టాప్ ర్యాంకులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారని.. సరిగా కరెక్షన్ చేయలేదని.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. టాప్ ర్యాంకులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారని.. సరిగా కరెక్షన్ చేయలేదని.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపడుతున్నారు. 

దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈ విషయంలో  అసలు నిజాలు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఇంటర్ మార్కుల్లో తీవ్ర గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లోనే లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను మార్చకపోతే.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసినా ప్రయోజనం ఉండదని.. మళ్లీ అదే రీతిలో పొరపాటు జరిగే అవకాశం ఉందని త్రి సభ్య కమిటీ హెచ్చరిస్తోంది.

దీనికి సంబంధించి పూర్తి నివేదికను శుక్రవారం సాయంత్రం త్రిసభ్య కమిటీ విడుదల చేయనుంది. దీనిలో మరిన్ని పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

click me!