ఇద్దరు కూతుళ్లకు ఉరేసి, తండ్రి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Apr 26, 2019, 08:48 AM IST
ఇద్దరు కూతుళ్లకు ఉరేసి, తండ్రి ఆత్మహత్య

సారాంశం

సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు

సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మండలం లచ్చపేటకు చెందిన బడుగు రాజేందర్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో ఏడాది క్రితం అతని భార్య మరణించింది. దీంతో కూతుళ్లు భవాని, లక్షీతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తన ఇద్దరు కుమార్తెలకు ఉరేసి , అనంతరం తాను కూడా ఉరి వేసుకున్నాడు.

స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

JanaSena Telangana New State: హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతనరాష్ట్ర కార్యాలయం ప్రారంభం
El Nino Effect: ఏపీ, తెలంగాణకు ఎల్ నినో సెగ.. ఈ ఏడాది వర్షాలు పడవా? పసిఫిక్‌ కు భారత వర్షాలకు సంబంధమేంటి?