Telangana Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్.. ఎప్పటి నుంచంటే..!

By Sumanth KanukulaFirst Published Jan 29, 2022, 10:16 AM IST
Highlights

తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు రంగం సిద్దమైంది. కరోనా వైరస్ (Coronavirus) నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విద్యాసంస్థలను తెరిచేందుకే సర్కార్ మొగ్గు చూపింది.

తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. కరోనా వైరస్ (Coronavirus) నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు ముగియనుండటంతో.. విద్యా సంస్థల ప్రారంభంపై తీవ్ర కసరత్తు చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలను తెరవాలనే నిర్ణయానికి వచ్చారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ రోజు విద్యాసంస్థల రీ ఓపెన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు (Sankranti holidays) కూడా కలిసివచ్చాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడగించనుందనే కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 30 వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. అయితే కొద్ది రోజులుగా 8వ తరగతి నుంచి ఆపై తరగతులకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. 

అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను తెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీ ఓపెన్‌కు తెలంగాణ వైద్య, విద్య శాఖల అధికారులు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

ఇక, నిన్న కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు..ఈ నెల 31 నుండి పాఠశాలలు తెరుస్తారా అని ప్రభుత్వాన్ని ఆరా తీసింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు.

click me!