తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్.. రిజిస్ట్రేషన్ల కోసం వాహనదారుల పడిగాపులు

By Siva KodatiFirst Published May 31, 2023, 2:18 PM IST
Highlights

తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్ అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . దీంతో టెక్నికల్ టీమ్ సర్వర్‌లో ఏర్పడిన ఇబ్బందిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. 

తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్ అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. తమ వాహనాలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతాయోనని వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో టెక్నికల్ టీమ్ సర్వర్‌లో ఏర్పడిన ఇబ్బందిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. 

ALso Read: ఏపీలో సర్వర్ల సమస్య : భూముల ధరల పెంపుతో.. రిజిస్ట్రేషన్ల కోసం పోటెత్తడంతోనే..

అటు ఏపీలోనూ గత రెండు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సోమవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో,, మంగళవారం కూడా పనిచేయకుండా అయ్యాయి. జూన్ 1 నుండి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు నివేదికల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత కొద్ది రోజులుగా భారీ రద్దీని ఎదుర్కొన్నాయని వర్గాలు తెలిపాయి. మార్కెట్ విలువను సవరించడం వల్ల స్టాంప్ డ్యూటీని పెంచడమే కాకుండా.. మొత్తం సవరించిన విలువతో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం చూపించాల్సి ఉంటుంది. దీంతో కొత్త విలువలు అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు కొనుగోలుదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు.
 

click me!